Tv424x7
Andhrapradesh

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన – రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్

కడప/మైదుకూరు నియోజకవర్గం ఖాజిపేట మండలం ఏటూరు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన నష్టపోయిన రైతులను పరామర్శించి, వారి సమస్యలను ఆరా తీశారు. అనంతరం జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారి చంద్ర నాయక్ గారితో ఫోన్ ద్వారా మాట్లాడి, దెబ్బతిన్న పంట పొలాలను తక్షణమే పరిశీలించి రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ లక్ష్మి రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, టీడీపీ నాయకుడు చంద్ర ఓబుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

TV4-24X7 News

ఏపీ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు

TV4-24X7 News

ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలు లేకుండా దారికి అడ్డుగా కంప

TV4-24X7 News

Leave a Comment