హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వెయ్యి డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (మెకానిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
అయితే, ఆసక్తిగల అభ్యర్థులు ఇంకా రెండు రోజుల్లోనే దరఖాస్తు చేయాలి. అక్టోబర్ 28 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
👉 అర్హతలు:
డ్రైవర్ పోస్టులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
వయసు పరిమితి: 22–35 సంవత్సరాలు.
శ్రామిక్ పోస్టులు: 18–30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు రాయితీ ఉంటుంది.
📅 దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 28
🌐 అధికారిక వెబ్‌సైట్: www.tgprb.in

