Tv424x7
National

కరూర్ బాధితుల మనసు గెలిచిన విజయ్!

కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను విజయ్ చెన్నైకు పిలిపించుకుని ఓదార్చారు. ఓ రిసార్టులో ప్రతి కుటుంబం వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడి, వారి బాధలను విన్నారు. ఇల్లు, చదువు, అనారోగ్యం వంటి సమస్యలను రాతపూర్వకంగా తీసుకుని, “మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను” అని హామీ ఇచ్చారు.

భావోద్వేగానికి లోనైన విజయ్బాధితులతో మాట్లాడుతుండగా విజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారని కుటుంబాలు మీడియాకు వెల్లడించాయి. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత విజయ్ వారికి కలుసుకునే అవకాశం దొరికింది. తొక్కిసలాట సమయంలో పారిపోయారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఇబ్బంది పడ్డారు. కరూర్‌కు తిరిగి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, చెన్నైలోనే బాధితులను పిలిపించుకుని పరామర్శించారు. ఈ చర్యతో బాధితుల అభిమానాన్ని సంపాదించారు.

మారిన వ్యూహంతో ప్రచారం పునఃప్రారంభంకరూర్ ఘటన తర్వాత విజయ్ ప్రచార కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇప్పుడు పార్టీ వ్యూహంలో మార్పులు చేస్తూ, భారీ ర్యాలీలకు బదులుగా చిన్న స్థాయి సమావేశాలు, డిజిటల్ ఔట్‌రీచ్‌ కార్యక్రమాలు చేపట్టాలని టీవీకే పరిశీలిస్తోంది.

సీబీఐ విచారణలో టీవీకే నేతలే నిందితులుతొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. ప్రాథమిక కేసులో టీవీకే నాయకులే నిందితులుగా ఉన్నారని సమాచారం. ఈ విచారణను విజయ్ స్వయంగా కోరుకోవడం వల్ల, ఇప్పుడు దానిపై ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం తక్కువగా ఉంది.

Related posts

ఉప్పుతో ముప్పు’.. మోతాదుకు మించి వినియోగం – ICMR..!!

TV4-24X7 News

బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు

TV4-24X7 News

జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే

TV4-24X7 News

Leave a Comment