Tv424x7
Andhrapradesh

బద్వేల్‌లో డ్రైనేజీ కాలువ పూడికల తొలగింపు పనులు ప్రారంభం

వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డులో హైవే పక్కన ఉన్న డ్రైనేజీ కాలువ ఎన్నో సంవత్సరాలుగా శుభ్రపరచకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై స్థానిక నాయకులు, ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో, మంత్రుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీ నిధులతో కాలువలో పేరుకుపోయిన పూడికలను తొలగించే పనులు ప్రారంభించారు.డ్రైనేజీ కాలువ శుభ్రపరిచే పనులు పూర్తయితే మురుగు నీటి సమస్య తగ్గి, ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

మామూలు దోపిడి కాదు.. ఆధార్‌లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే..

TV4-24X7 News

మైనర్లు వాహనాలు నడుపరాదు:- సీఐ మహబూబ్ బాషా

TV4-24X7 News

జగన్ కలయిక పాస్‌ల వివాదం

TV4-24X7 News

Leave a Comment