Tv424x7
Andhrapradesh

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన

నెల్లూరు, మే 18: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల 18, 19 తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.మే 18 (సోమవారం):మధ్యాహ్నం 2:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరనున్న మంత్రి, సాయంత్రం 5:30 గంటలకు కావలి మార్గంలో తుమ్మలపెంటకు చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించనున్నారు.అనంతరం సాయంత్రం 6:30 గంటలకు తుమ్మలపెంట నుంచి బయలుదేరి రాత్రి 7:30 గంటలకు నెల్లూరుకు చేరుకుని బస చేయనున్నారు.మే 19 (మంగళవారం):ఉదయం 8 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు తుమ్మలపెంటకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు.అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:15 గంటల వరకు తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి పాల్గొనే “మత్స్యకారుల సేవలో” తదితర కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొననున్నారు.కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు తుమ్మలపెంట నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు నెల్లూరుకు చేరుకుని బస చేయనున్నారు.

Related posts

మహిళా పోలీసులతో సీఐ దేముడు బాబు సమావేశం

TV4-24X7 News

కడప జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేదం : ఎస్పీ

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు ఆటంకం”!

TV4-24X7 News

Leave a Comment