Tv424x7
Crime News

“నా ఇంట్లో నా ప్రియుడు కూడా ఉండాల్సిందే”.. భార్య వింత కోరికతో భర్తకు షాక్!

ప్రేమ, వివాహం, నలుగురు పిల్లలతో ప్రశాంతంగా సాగుతున్న ఓ కుటుంబ జీవితం.. భార్య వింత కోరికతో ఒక్కసారిగా కలకలం రేపింది. “నేను నీతోనే ఉంటాను.. కానీ నా ప్రియుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి” అంటూ భార్య పెట్టిన షరతు భర్తను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో వెలుగులోకి వచ్చింది.గ్వాలియర్‌లోని సికిందర్ కాంపూ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ కుష్వాహా అనే వ్యక్తి 2008లో పూనమ్ కుష్వాహాను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది.అయితే, 2026 జనవరి 22న పూనమ్ ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు భర్త తెలిపాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నాడు. అనంతరం రెండు నెలల తర్వాత మార్చిలో తిరిగి వచ్చిన పూనమ్.. తాను కమల్ సేన్ (ఆశు) అనే యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకుందని సమాచారం.ఇంతటితో ఆగకుండా, “నేను నీతోనే ఉంటాను.. కానీ నా ప్రియుడు కూడా మన ఇంట్లోనే మనతోపాటు ఉండాలి” అంటూ భర్తకు షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి భర్త రాజ్‌కుమార్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు.ఈ వివాదం మే 5న తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. భర్త ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన పూనమ్.. ఇటుకతో దాడి చేసి తలకు గాయపరిచిందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని, ప్రాణహాని కలిగిస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు.ఆ తర్వాత పూనమ్ ఇంట్లోని నలుగురు పిల్లలు, నగదు, బంగారు, వెండి ఆభరణాలను తీసుకుని తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు భర్త ఆరోపిస్తున్నాడు.గాయాలతో బాధపడుతున్న రాజ్‌కుమార్ గ్వాలియర్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి, తన భార్య, ఆమె ప్రియుడి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Related posts

నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి

TV4-24X7 News

విజయవాడ నగరంలో విషాదం..‼️

TV4-24X7 News

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

TV4-24X7 News

Leave a Comment