Tv424x7
Crime NewsTelangana

నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి

హైదరాబాద్ :-ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన హయత్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదం డ్రులు తనను హాస్టల్ ల్లో వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగలు గిరీష్ కుమార్‌ తలకు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, గిరీష్ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న గిరిష్ కుమార్ మృతి చెంద డంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు…

Related posts

గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.

TV4-24X7 News

గోదావరికి ఉద్ధృతి.. మంత్రి పొంగులేటి సమీక్ష

TV4-24X7 News

తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ను ప్రారంభించిన సీతక్క

TV4-24X7 News

Leave a Comment