Tv424x7
Andhrapradesh

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: కడప ఆర్డీఓ

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కడప ఆర్డీఓ జి. ఆర్ మధుసూదన్ హెచ్చరించారు. కడప ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా సిద్దవటం, ఒంటిమిట్ట, కడప, చెన్నూరు, వల్లూరు, తదితర సచివాలయాల్లో రెవిన్యూ, పోలీస్, మైన్స్ అండ్ జియాలాజీ శాఖల అధికారుల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఇసుక రీచ్ లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో కడప డివిజన్ పరిధిలోని అన్ని సచివాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు.

Related posts

కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం

TV4-24X7 News

తీవ్ర వాయుగుండం.. ఒడిశా–ఆంధ్ర తీరాలకు ముప్పు..

TV4-24X7 News

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

TV4-24X7 News

Leave a Comment