Tv424x7
Andhrapradesh

ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు

అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ … దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కీలక ఆదేశాలు జారీచేసింది..ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్‌ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ … 33 బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బిఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డిబిఎస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్‌, ఆర్‌టిజిఎస్‌తోపాటు చెక్‌ క్లియరెన్స్‌ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి..

Related posts

25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు

TV4-24X7 News

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యాయత్నం!!

TV4-24X7 News

ఎంత బతిమాలినా జీతం డబ్బులు ఇవ్వలేదు…అందుకే బంగారు నగలు అపహరించా

TV4-24X7 News

Leave a Comment