Tv424x7
Andhrapradesh

ఓటమి ప్రస్టేషన్‌లో దాడులకు దిగుతున్న వైసీపీ నేతలు

Kesineni Chinni: విజయవాడ: వైసీపీ (YSRCP) నేతలు ఓటమి భయంతో ప్రస్టేషన్‌లో దాడులకు దిగుతున్నారని విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. మంగళవారం నాడు నందిగామలో వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు కిషోర్, నరసింహారావులను ఆంధ్రా హాస్పిటల్‌లో ఆ పార్టీ నాయకులు కేశినేని చిన్ని, నెట్టం రఘురామ్, కార్యకర్తలు పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ… నందిగామలో టీడీపీ కార్యకర్తలు కిషోర్, నరసింహారావులపై వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గ్యాంగ్ దాడి చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల అంశంపై తమ కార్యకర్తలు ప్రశ్నిస్తే మొండితోక జగన్మోహన్‌రావు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు..దాడి చేసిన వారిపై పోలీసులు 307 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దర్యాప్తు చేయాలని కోరారు.ఈ దాడిపై విజయవాడ సీపీ,ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. నందిగామలో మొండితోక బ్రదర్స్ అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఆయన పద్ధతి మార్చుకోకోపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్మోహన్ రావు బెదిరింపులు, దాడులకు తాము భయపడమని వార్నింగ్ ఇచ్చారు..

Related posts

బాలాపూర్ రికార్డ్ బ్రేక్.. మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుడి లడ్డూ ఎన్ని లక్షలో తెలుసా..?

TV4-24X7 News

వైఎస్ జగన్ కు బిగ్ షాక్.. విశాఖలో వైసీపీ సీనియర్ నేత గుడ్ బై..!

TV4-24X7 News

సూరాడ రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment