నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. కరీముల్లా, అమ్ములు దంపతులకు రెండేళ్ల కుమారుడు కాలేషా ఉన్నాడు. అమ్ములు స్థానికంగా ఉండే చేపల దుకాణంలో పనిచేస్తోంది. కుమారుడిని కూడా వెంట తీసుకెళ్తూ ఉండేది. ఈనెల 7న తల్లితో పాటు చేపల దుకాణానికి వెళ్లిన కాలేషా.. పెట్రోల్ బాటిల్ను చూసి కూల్డ్రింక్ అనుకొని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కాలేషా చికిత్స పొందుతూ మరణించాడు.

previous post
next post