Tv424x7
Andhrapradesh

డాక్టర్ సునీత నర్రెడ్డి ఐడీఎస్‌ఏ ఫెలోగా ఎన్నిక…

ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (IDSA) ప్రకటణ…అపోలో హాస్పిటల్స్, డాక్టర్ సునీత నర్రెడ్డి ఐడీఎస్‌ఏ ఫెలోగా ఎన్నికైనట్లు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (IDSA) ప్రకటించింది. ఈ గౌరవప్రదమైన గుర్తింపు అంటు వ్యాధుల రంగంలో డాక్టర్ సునీత నర్రెడ్డి విశేషమైన కృషికి, అంకితభావానికి నిదర్శనం అని తెలిపారు. ఐడీఎస్‌ఏ లో ఫెలోషిప్ అనేది అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు ప్రతిష్టాత్మకమైన గౌరవం. డాక్టర్ సునీత నర్రెడ్డి నైపుణ్యం, అంటు వ్యాధులపై అవగాహన, నివారణ, చికిత్సను అభివృద్ధి చేయడంలో నిబద్ధత తదితర అంశాలు ఆమెకు ఈ ఫెలోషిప్‌ను అందుకోవడంలో దోహదపడ్డాయి. డాక్టర్ సునీత నర్రెడ్డి అంకితభావం, నాయకత్వం, నైపుణ్యం, రోగుల సంరక్షణ ఐడీఎస్‌ఏ సంస్థకు ఎంతో దోహదపడతాయని ఐడీఎస్‌ఏ అధ్యక్షుడు స్టీవెన్ కె స్మిత్ అన్నారు. ఐడీఎస్ఏ ఫెలో షిప్ దక్కినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ సునీత నర్రెడ్డి అన్నారు. ఈ గుర్తింపు అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి, ఆరోగ్య సంరక్షణ పట్ల తన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఐడీఎస్‌ఏ ద్వారా ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పొందినందుకు డాక్టర్ సునీత నర్రెడ్డిని అభినందిస్తున్నామని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. అంటు వ్యాధులను ఎదుర్కొవడంలో ఆమె అలుపెరగని అంకితభావం, ఆరోగ్య సంరక్షణలో నిబద్ధత అపోలో హాస్పిటల్స్‌కి గర్వకారణం అని అన్నారు .

Related posts

నెల్లూరు టీడీపీపై సంచలన ఆరోపణలు: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

TV4-24X7 News

కార్యకర్తలతో సమావేశమైన ఎరిక్షన్ బాబు…

TV4-24X7 News

గోరంట్ల మాధవ్‌కు మే 7 వరకు రిమాండ్‌

TV4-24X7 News

Leave a Comment