Tv424x7
Andhrapradesh

అర్ధరాత్రి ఆలయంలో వింత శబ్దాలు.. పూజారి వెళ్లి చూడగా దిమ్మతిరిగిపోయే ఘటన

.గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు గ్రామంలోని ఆలయం నుంచి అర్ధరాత్రి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. స్థానికులకు అవి వినిపించినా.. ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక పూజారి ప్రతి రోజూలానే తెల్లారి గుడికెళ్లేసరికి.. అక్కడ కనిపించిన సీన్‌తో దెబ్బకు అవాక్ అయ్యాడు

ప్రకాశం జిల్లా… బేస్తవారిపేట మండలం మోక్షగుండంలో పురాతన ముక్తేశ్వరాలయం ఒకటి ఉంది. శనివారం అర్ధరాత్రి ఆ ఆలయంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఆలయ ప్రాంగణంలోని నంది విగ్రహాన్ని పెకలించి.. దాని కింద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆదివారం ఉదయాన్నే పూజారి ఆలయానికి వెళ్లి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యానికి దెబ్బకు షాక్ అయ్యాడు. గుప్త నిధుల కోసం ఎవరో ఇలా చేశారని గుర్తించి.. వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆలయంలో ఇలా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు తెలిసి.. అది ఆ నోటా.. ఈ నోటా పాకడంతో స్థానికంగా కలకలం రేపింది.

Related posts

చౌక ధరల దుకాణదారుడిపై కేసు నమోదు!!

TV4-24X7 News

ప్రొద్దుటూరులో గృహపథక ఇళ్లు విక్రయానికి: లబ్ధిదారుల ఆవేదన..

TV4-24X7 News

తోక తిప్పితే తాటా తీస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్

TV4-24X7 News

Leave a Comment