Tv424x7
Andhrapradesh

శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్..

శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు..ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందిన భక్తులు శ్రీమల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాధారణ భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు..భక్తుల రద్దీ పెరగడంతో టోల్‌గేట్‌ మలుపు వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. పెద్ద ఎత్తున వచ్చిన వాహనాలు శివపార్వతుల విగ్రహాల వద్ద నిలిపివేయడంతో ఆలయానికి వచ్చి తిరిగి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంతోపాటు, సమస్యలు తలెత్తకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు..

Related posts

వాళ్లిద్దరు ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తా: మాజీ ఎంపీ లగడపాటి

TV4-24X7 News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

TV4-24X7 News

వైయస్సార్ కడప జిల్లా: మైదుకూరులో కేసీ కెనాల్ చారిత్రక అక్విడెక్ట్ కట్టడంపై మొక్కల తొలగింపు

TV4-24X7 News

Leave a Comment