Tv424x7
Andhrapradesh

గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త

ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. ఖమ్మంలోని జయనగర్‌కాలనీలో గంగాభవానీకి భాస్కరాచారితో 2018లో వివాహం జరిగింది. గుండె కుడి వైపు ఉందని, ఈ విషయం దాచి పెళ్లి చేశారని ఆమెను పుట్టింటికి పంపించివేశారు. దీంతో కోర్టును ఆశ్రయించగా తీర్పు వచ్చేవరకు ప్రతినెలా మనోవర్తి రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. మనోవర్తి డబ్బులు అడిగేందుకు వెళ్లిన గంగాభవానీపై అత్తామామలు దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో బోనకల్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Related posts

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

TV4-24X7 News

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్‌

TV4-24X7 News

హైదరాబాద్, విజయవాడకు నిలిచిపోయిన రాకపోకలు

TV4-24X7 News

Leave a Comment