Tv424x7
National

మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూ ఢిల్లీ :సెప్టెంబర్ 21మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకు పోతుందని కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హింసను వీడి లొంగిపోవా లని మావోయిస్టులకు సూచించారు. ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ హింసాకాండలో 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఈమేరకు వ్యాఖ్యానిం చారు. దేశంలో మావోయి స్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించు కున్నారని అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టులు ఒకప్పుడు నేపాల్ నుంచి పశుపతి నాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావించారని కానీ, మోడీనేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశామన్నారు. ఈసందర్భంగా హింసను, ఆయుధాలను వదిలేసి జనజీవ స్రవంతిలోకి కలిసిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు..

Related posts

భారతీయుల దెబ్బ.. తుర్కియేకి భారీ నష్టం

TV4-24X7 News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ₹100 నాణెం ఆవిష్కరించారు

TV4-24X7 News

భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో ఏమి చేసాడో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment