విశాఖపట్నం మహాత్మా గాంధీకి ఘన నివాళులు కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు ఒక వరం లాంటిదని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం అల్లిపురం నేరెళ్ల కోనేరు వద్ద దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 200 మందికి కళ్ళద్దాలను పంపిణీ చేశారు.అనంతరం కొందరు మహిళల కార్యకర్తలకు చీరలను కూడా పంపిణీ చేశారు.అలాగే జివిఎంసి గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని కందుల నాగరాజు నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.ఆయన స్ఫూర్తిదాయక సేవలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. కందుల నాగరాజు మాట్లాడుతూ సరైన కంటి చూపు చాలా అవసరమని తెలిపారు. మనలో చాలా మంది కంటి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపరని, మన కళ్లు బాగా చూడగలవని అనుకుంటామని, లేదా ఏదో ఒక సమయంలో మనం కంటి వైద్యుడిని సంప్రదించి, వారి సలహాతో అద్దాలు తీసుకొని వదిలేస్తామని అన్నారు.డ్రైవింగ్, చదవడం మొదలైన ముఖ్యమైన రోజువారీ కార్యకలాపాలను చేస్తున్నప్పుడు దృష్టి ఖచ్చితత్వం అవసరమని పేర్కొన్నారు. బలహీనమైన కంటి చూపు ఉన్న వ్యక్తులకు, ఆ దృష్టిని కొనసాగించడానికి దిద్దుబాటు కళ్లద్దాలు గొప్ప సహాయంగా ఉంటాయన్నారు.జనసేన నార్త్ ఇంచార్జ్ ఉషకిరణ్ మాట్లాడుతూ కందుల నాగరాజు చేపడుతున్న కార్యక్రమాల కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు.ఒక ప్రజా ప్రతినిధి గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతోమందికైనా సహాయం చేశారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బయన సునీల్,శివప్రసాద్ రెడ్డి , కందుల కృష్ణ , శాలివాహన ,సిహెచ్ బుజ్జి , కందుల రాజశేఖర్ , మధ్య రాజశేఖర్ రెడ్డి, నారా నాగేశ్వరరావు,తెలుగు అర్జున్, దసన సత్యనారాయణ , దుర్గ రెడ్డి , నారాయణ రెడ్డి , దక్షిణ నియోజకవర్గ యువ నాయకులు 32వ వార్డ్ ఇంచార్జ్ కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్, జనసైనికులు , విరామహిళలు , తదితరులు పాల్గున్నారు.

previous post
next post