Tv424x7
Andhrapradesh

జీవీఎంసీ కమిషనర్ ని కలిసిన జనసేన పార్టీ శ్రేణులు

విశాఖపట్నం స్వచ్ఛత భాగిదారి లో విశాఖ మొదటి స్థానంలో నిలిపి,ప్రత్యేక చొరవ చూపిస్తున్న కమిషనర్ కి ఎమ్మెల్యే వంశీకృష్ణ జనసేన శ్రేణులు ఘన సన్మానం. గురువారం జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ని విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ జనసేన పార్టీ వివిధ నియోజకవర్గాల ఇన్చార్జి లు, కార్పొరేటర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు కమిషనర్ కి శాలువా వేసి, పూలబొకే అందజేశారు. అనంతరం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. వార్డ్ పరిధిలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వివిధ నియోజకవర్గాల ఇన్చార్జీలు ఉషాకిరణ్, సందీప్, శివ ప్రసాద్ రెడ్డి, జి.వి.ఎం.సి ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి జీకే, కార్పొరేటర్లు నాగరాజు, గోవింద రెడ్డ, ఉష, సూర్య కుమారి, కామేశ్వరి, పుర్రె సురేష్ పాల్గొన్నారు.

Related posts

విజయవాడలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం!!

TV4-24X7 News

దుర్గమ్మ కరుణా కటాక్షంతోనే ఈ స్థాయికి వచ్చాను

TV4-24X7 News

పులివెందుల డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నూతన ఇన్చార్జి గా కె.వి. విజ్ఞేశ్వర్

TV4-24X7 News

Leave a Comment