Tv424x7
Telangana

హైడ్రాకు ఇక తిరుగులేదు.. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

హైడ్రా చట్టబద్ధతను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం ప్రభుత్వ వివరణపై గవర్నర్ సంతృప్తిహైడ్రాకు ఇప్పుడు మరిన్ని అధికారాలుహైడ్రా చట్టబద్ధతపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ దానిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. హైడ్రా కూల్చివేతలపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దాని చట్టబద్ధతను సవాలు చేశారు. హైకోర్టు కూడా హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో హైడ్రా ఆర్డినెన్స్‌కు రాజ్‌భవన్ ఆమోద ముద్ర వేయడంతో దానికి చట్టబద్ధత లభించినట్టయింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో వచ్చే ఆరు నెలల వ్యవధిలో అసెంబ్లీలో హైడ్రా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానికి మరిన్ని అధికారాలు దఖలు పడనున్నాయి.ఫార్చూన్-500 కంపెనీల్లో కీలకమైన బయో టెక్నాలజీ, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని అనుబంధ సంస్థలు వంటి వాటికి హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని, ఈ నేపథ్యంలో నగరాన్ని కాపాడుకోవడం, వాణిజ్య కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని, కాబట్టే జీహెచ్ఎంసీ చట్టసవరణ ద్వారా ప్రత్యేక ఏజెన్సీని రూపొందించాల్సి వచ్చిందని ప్రభుత్వ హైడ్రా ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఈ వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు.

Related posts

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ…🖊️

TV4-24X7 News

బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు…

TV4-24X7 News

గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం:: మాజీ మంత్రి హరీష్ రావు

TV4-24X7 News

Leave a Comment