Tv424x7
Telangana

నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

సూర్యాపేట: జిల్లా అక్టోబర్ 24తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడు రోజుల పర్యటన లో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా.సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఏర్పాటు చేస్తున్నారు.గురువారం కలెక్టర్ సమా వేశమందిరంలో గవర్నర్ పర్యటన ఉన్నందున అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను పిపిటి ద్వారా గవర్నర్ కు వివరించను న్నారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఐదు స్టాళ్లను గవర్నర్ తిలకించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి11:30 గంటల వరకు జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం, అనంతర శాఖల వారిగా తమ లక్ష్యాలను గవర్నర్ కు వివరించనున్నట్లు సమాచారం.

Related posts

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ హెచ్చరిక!!

TV4-24X7 News

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

TV4-24X7 News

తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమావేశం…

TV4-24X7 News

Leave a Comment