Tv424x7
Andhrapradesh

హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం..

AP News:హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఇవాళ(ఆదివారం) ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లనున్నారు..ఏఐజీ హాస్పిటల్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రామ్మూర్తినాయుడి భౌతికకాయం చేరుకుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దగ్గరుండి తన చిన్నాన్న భౌతికకాయాన్ని నారావారిపల్లెకు మంత్రి నారా లోకేష్ తరలిస్తున్నారు.ప్రత్యేక విమానంలో నారా రామ్మూర్తి నాయుడు పార్థీవదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి నారా లోకేష్ తీసుకురానున్నారు. 7: 45గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానం చేరుకోనుంది. 9 గంటలకు నారావారిపల్లిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటికి రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహం చేరుకోనుంది. నారా లోకేష్‌తో పాటు నారా , నందమూరి కుటుంబాలు, పార్టీ శ్రేణులు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఉదయం 9:30గంటల నుంచి రామ్మూర్తి నాయుడుని చివరి చూపు చూడడానికి కార్యకర్తలకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 2:30గంటలకు నారావారిపల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి నారా రామూర్తి నాయుడు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. నారావారిపల్లెలోని నారా రామ్మూర్తి నాయుడు అమ్మానాన్నలు సమాధులు ఉన్న చోటే నారా రామూర్తి నాయుడుకి అంతిమ సంస్కారాలు చేయనున్నారు..

Related posts

మృతి చెందిన టీడీపీ నేతలకు ఘననివాళులర్పించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

TV4-24X7 News

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

TV4-24X7 News

పులివెందుల నుంచి షర్మిల పోటీ?

TV4-24X7 News

Leave a Comment