అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలం ముగిసిపోగా వారి సేవలను 2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే సేవల పొడిగింపు వర్తిస్తుందని ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయుష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇక, కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

