Tv424x7
Andhrapradesh

గుంటూరు మునిసిపల్ కమిషనర్ కీర్తికి జైలు శిక్ష

కోర్టు ఆదేశాలు పాటించని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని ఆక్రమంగా ఆక్రమించుకొనీ ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూలు నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్ కు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను మునిసిపల్ కమిషనర్ అమలు చేయడం లేదంటూ పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మునిసిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజులు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్టర్ వద్ద లొంగిపోవాలని ఆమెను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Related posts

నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం

TV4-24X7 News

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి..!

TV4-24X7 News

అనకాపల్లి వద్దు బాబోయ్‌ జిల్లా కేంద్రంలో తహశీల్దారుగా పనిచేయడానికి భయపడుతున్న అధికారులు

TV4-24X7 News

Leave a Comment