Tv424x7
Andhrapradesh

రైస్ మిల్లుపై అకస్మిక తనిఖీ

కడప రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ షేక్ మాసుం బాష ఆదేశాల మేరకు ఈ దినం 12-12-2023 వ తేదీన కడప విజిలెన్స్ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు & తూనికలు, కొలతల శాఖ అధికారులు మరియు స్థానిక ఎన్ఫోర్ మెంట్ అధికారులతో కలిసి వై.ఎస్.ఆర్.జిల్లా మైదుకూరు పట్టణము నందు గల శ్రీ లక్ష్మీ గణేషా మెగా మోడరన్ రైస్ మిల్లును అకస్మికంగా తనిఖీ చేసినారు. ఈ తనిఖీలలో మిల్లులో గల భౌతిక నిల్వలు మరియు రికార్డులను పరిశీలించినారు. ఈ మిల్లు యందు గల Auctioned PDS seized Rice కు సంబంధించిన భౌతిక నిల్వలు మరియు మిల్లుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి పరిశీలించినారు. దీనిలో గల లోటుపాట్లను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపినారు. ఈ తనిఖీలలో రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ అధికారి అయిన షేక్ మాసూం బాష స్వయంగా పాల్గొని ఈ తనిఖీని పర్యవేక్షించినారు. మిల్లుదారులు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించక పోయినా, ఏవైనా అవకతవకలకు పాల్పడినా అటువంటి మిల్లుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా షేక్ మాసూం బాష హెచ్చరించినారు.

Related posts

ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!

TV4-24X7 News

రాజంపేటలో TDP, YCP కార్యకర్తల మధ్య ఘర్షణ

TV4-24X7 News

రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి …రూ.45.68 లక్షల సాయం చేసిన అతని స్నేహితులు

TV4-24X7 News

Leave a Comment