Tv424x7
Andhrapradesh

కంట్లో కారం చల్లి తప్పించుకున్న దొంగ

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో దొంగతనం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే… వృద్ధ దంపతులు మంజ్యా (70), బంగారి (65) ఇంటి ముందు కొట్టంలో నిద్రిస్తుండగా, ఒక ఆగంతుకుడు ఇంట్లోకి చొరబడి ఐదు వేల రూపాయల నగదు అపహరించాడు.

తరువాత వృద్ధురాలు బంగారి మెడలోని పుస్తెల తాడు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మెలుకువ వచ్చిన ఆమె, దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడు కంట్లో కారం చల్లి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితులు కొత్తగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

వడదెబ్బకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి

TV4-24X7 News

పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు మరియు భారీ జెండా ర్యాలీని ఘనంగా నిర్వహించిన వివేకానంద సంస్థ

TV4-24X7 News

17 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై సామూహిక దాడి

TV4-24X7 News

Leave a Comment