పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అందుకారణం: డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరమ చేయడానికి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించబోయే “ఛలో పిడుగురాళ్ల” కార్యక్రమానికి వెళ్ళకుండా నిరోధించడమే.
పట్టణ పోలీసుల ఈ చర్యని, ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా రాజకీయ నిరసనను ఆపడానికి తీసుకున్న చర్యగా చూడవచ్చు.

