Tv424x7
Andhrapradesh

ST కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం PRSYF డిమాండ్!!

ST కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేసి, నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు స్వయం ఉపాధి కల్పించాలని PRSYF రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ST కార్పొరేషన్ ఆఫీసులో ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & DTWO, K. సరస్వతి గారికి వినతి పత్రం అందజేశారు.

కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ, 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ రుణాల నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, గత 5 సంవత్సరాలుగా ఇలాంటి నోటిఫికేషన్ లేకపోవడం బాధాకరమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన, నిరుద్యోగ యువతీ, యువకులు ఈ రుణాల కోసం ఎదురు చూస్తున్నారని, డిగ్రీలు, పీజీలు పూర్తిచేసినా ఉపాధి లేక ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నట్లు తెలిపారు.

అంతేకాక, NDA కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత ST కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల కాక, హామీ అమలుకాదు అని మండిపడ్డారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, సబ్సిడీ రుణాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలను విస్తరించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో PRSYF జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్ర బాబు కూడా పాల్గొన్నారు.

Related posts

కారులో తరలిస్తున్న 6ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఒకరి అరెస్టు

TV4-24X7 News

యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త.

TV4-24X7 News

హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా చిలకపేట యూత్ బాయ్స్

TV4-24X7 News

Leave a Comment