Tv424x7
Telangana

తెలంగాణలో కొత్త వాహనాలపై రోడ్స్ సేఫ్టీ సెస్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!!

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై ప్రభుత్వం ‘రోడ్ సేఫ్టీ సెస్’ పేరుతో అదనపు భారం మోపుతున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ విమర్శల ప్రకారం, రహదారి ప్రమాదాల నివారణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆ భారం ప్రజలపై మోపడం ప్రజా వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. కొత్త వాహనంపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు సెస్ వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన అన్నారు.

“ప్రభుత్వం హైడ్రా వంటి తప్పుడు విధానాలతో ఖజానా లోటును పూరించడానికే ఈ పన్నులను వేస్తోంది. గత రెండేళ్లలో ఇచ్చిన గ్యారెంటీలు అమలులోకి రాలేదు. ఇప్పుడు ప్రజల నుంచి రూ.270 కోట్లు వసూలు చేయాలనేది కుట్ర” అని కేటీఆర్ అన్నారు.

ప్రజల కష్టపడి కూడబెట్టిన డబ్బులు, అప్పులు వాహనాల కోసం ఖర్చు అవుతున్న సందర్భంలో ఈ విధమైన అదనపు పన్నులు వేయడం ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆయన అన్నారు. కేటీఆర్ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు, లేకపోతే ప్రజలు కాంగ్రెస్ సర్కారును క్షమించరని హెచ్చరించారు.

Related posts

హైదరాబాద్‌ జూలో బెంగాల్ టైగర్ అభిమన్యు మృత్యువాత

TV4-24X7 News

మహబూబాబాద్: జాతీయ రహదారి పై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి!

TV4-24X7 News

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

TV4-24X7 News

Leave a Comment