స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇవి అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 ఎంపీపీ, జడ్పీటీసీ, 2,421 ఎంపీటీసీ, 5,359 పంచాయతీ స్థానాలు దక్కనున్నట్లు సమాచారం. దీనిపై జీవో వచ్చాక మరింత క్లారిటీ రానుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 2,345 జీపీలు, 90 జడ్పీటీసీ, 95 ఎంపీపీ, 1,011 ఎంపీటీసీ స్థానాలను బీసీలకు కేటాయించింది.

