ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇంతవరకు మేడారం జాతరకు ప్రభుత్వాలు కేవలం తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితమయ్యాయి.
గతంలో ముఖ్యమంత్రులు కూడా ఏర్పాట్లపై సమీక్షకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే తొలిసారిగా సీఎం రేవంత్ స్వయంగా మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే నేడు ఆయన మేడారం క్షేత్ర స్థాయి సందర్శనకు వెళుతున్నారు.

