Tv424x7
Telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని గుర్తుచేసుకున్న కౌశిక్ రెడ్డి, ఆయన పాలనను తీవ్రంగా విమర్శించారు.

“రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నడుము సముద్రంలో ముంచుతున్నారు. మోడీ ఏది చెప్తే అదే చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.

గ్రూప్-1 పరీక్షల సమయంలో తమ ప్రభుత్వంపై హంగామా చేసిన బీజేపీ నాయకుడు బండి సంజయ్, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా రేవంత్ రెడ్డిపై ఒక్క మాట మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

“తెలంగాణలో కాంగ్రెస్–బీజేపీలు కలసి పనిచేస్తున్నాయి కాబట్టే బండి సంజయ్ నోరు మూసుకున్నారు” అని ఆరోపించారు.

మొత్తానికి, కాంగ్రెస్–బీజేపీ మధ్య కుమ్మక్కు ఉందని బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Related posts

ఘనంగా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

TV4-24X7 News

పాతబస్తీ మాన్‌హోల్ ఘటనపై HYDRAA పై ప్రభుత్వం సీరియస్!!

TV4-24X7 News

అల్లు అర్జున్ విడుద‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

TV4-24X7 News

Leave a Comment