అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం (మంగళవారం) వారు కేంద్ర రాజధానికి చేరుకున్నారు.
ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారని సమాచారం. అక్టోబర్ 16న కర్నూలులో జరగనున్న జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు.
అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ముఖ్యమంత్రి సమావేశం జరుపుతూ రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక మద్దతు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఐఐ సదస్సులోనూ పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై సూచనలు అందించనున్నారు.

