Tv424x7
National

రైల్వే టిక్కెట్ల నుంచి యూపీఐ వరకు.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న కీలక మార్పులు :

ప్రతి నెల మొదటి తేదీ ఆర్థిక పరంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కొత్త ఆర్థిక నియమాలు అమల్లోకి వస్తాయి. అక్టోబర్‌ 1, 2025 నుంచి కూడా పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఇవి నేరుగా సాధారణ ప్రజల ఖర్చులు, లావాదేవీలపై ప్రభావం చూపనున్నాయి.

ఎల్‌పిజి సిలిండర్ ధరలుపండుగ సీజన్ దృష్ట్యా గృహిణులు ఆశగా ఎదురుచూస్తున్న మార్పు ఎల్‌పిజి ధరలది. గత నెలల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గించగా, ఈసారి 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో తగ్గింపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

రైల్వే టికెట్ బుకింగ్ నియమాలుఇండియన్ రైల్వేస్‌ అక్టోబర్‌ 1 నుంచి కొత్త టికెట్ రూల్స్‌ అమలు చేయనుంది. టికెట్ మోసాలను అరికట్టేందుకు రిజర్వేషన్ సమయంలో ప్రయాణికుల వివరాల నిర్ధారణను మరింత కఠినతరం చేసింది. ఆన్‌లైన్‌ బుకింగ్ సిస్టమ్‌లో కొత్త సాంకేతిక మార్పులు కూడా అమలులోకి వస్తున్నాయి.

పెన్షన్ నిబంధనలుపెన్షనర్లకు సంబంధించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో సులభతరం చేసే మార్పులు తీసుకొస్తున్నారు. దీని వల్ల వృద్ధులు బ్యాంకులు తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో ధృవీకరణ చేయగలరు.

యూపీఐ చెల్లింపులుయూపీఐ వినియోగదారుల కోసం కూడా కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. కొన్ని లావాదేవీలపై సర్వీస్ ఫీజు మారుతుండగా, చిన్న మొత్తాల చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యం కల్పించే అవకాశం ఉంది.

బ్యాంక్ నిబంధనలుకొన్ని బ్యాంకులు తమ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో మార్పులు చేయగా, కొన్ని క్రెడిట్/డెబిట్ కార్డ్ సర్వీస్ ఛార్జీలలో సవరణలు చేస్తున్నాయి. ఇవి కూడా అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

Related posts

భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది..!

TV4-24X7 News

స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా?

TV4-24X7 News

ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

TV4-24X7 News

Leave a Comment