భారత్ మరో చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. తూర్పు లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డును నిర్మించి కొత్త రికార్డును సృష్టించింది.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఆధ్వర్యంలో మిగ్ లా పాస్ వద్ద 19,400 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు హాన్లే ప్రాంతాన్ని ఫుక్చే గ్రామంతో అనుసంధానిస్తుంది.
ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగా కూడా అత్యంత ప్రాధాన్యం పొందింది. రోడ్డు పూర్తయి వాహన రాకపోకలకు సిద్ధంగా ఉందని బీఆర్ఓ అధికారులు తెలిపారు.
గతంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు పొందిన ఉమ్లింగ్ లా పాస్ (19,024 అడుగులు) రికార్డును మిగ్ లా పాస్ రోడ్ అధిగమించింది.
ఈ అద్భుత నిర్మాణంతో భారత్ ఇంజనీరింగ్ రంగంలో మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పింది

