అరట్టై అంటే: తమిళంలో “మాట్లాడటం”. జోహో 2021లో ప్రారంభించిన మెసేజింగ్ యాప్.
ఫీచర్లు: వన్-టు-వన్, గ్రూప్ చాట్స్, ఫొటో/వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్, ఆడియో & వీడియో కాల్స్ (ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్), మల్టీ-డివైజ్ సపోర్ట్, ప్రైవసీ ప్రామిస్.
వృద్ధి: కేవలం 3 రోజుల్లో రోజువారీ సైన్‌అప్స్ 3 వేల నుంచి 3.5 లక్షలకు చేరుకున్నాయి. నంబర్-1 స్థానం ఆండ్రాయిడ్ & ఆపిల్ యాప్ స్టోర్‌లో.
ఇబ్బందులు: ఓటీపీ ఆలస్యం, కాంటాక్ట్ సింక్ సమస్యలు, కాల్ ఫెయిల్యూర్స్. జోహో త్వరలో పరిష్కరిస్తుందని ప్రకటించింది.
వాట్సాప్ తో పోటీ: ప్రస్తుతం కాల్స్ ఎన్‌క్రిప్టెడ్ కానీ చాట్స్ E2E ఎన్‌క్రిప్షన్ కాని కారణంగా వాట్సాప్‌కు ఫీచర్ పరంగా కొంత అడ్వాంటేజ్ ఉంది. నిపుణుల ప్రకారం, ప్రైవసీ ప్రామిస్ అమలు అయితే అరట్టై గట్టి పోటీ ఇవ్వగలదు.

