Tv424x7
Andhrapradesh

ఆటో డ్రైవర్‌ సేవలో” పథకానికి సీఎం శ్రీకారం..

ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం కొత్త పథకం ప్రారంభమైంది. ‘ఆటో డ్రైవర్ సేవలో’ పేరుతో ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలో శ్రీకారం చుట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 90 వేల మంది డ్రైవర్లకు ఈ ఏడాది నుంచే లబ్ధి చేకూరనుంది. ఒక్కో డ్రైవర్ ఖాతాలో రూ.15 వేల చొప్పున నేరుగా జమ చేయనుందని ప్రభుత్వం ప్రకటించింది.

మొత్తం రూ.436 కోట్లను ఈ పథకం కోసం కేటాయించినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆదాయం తగ్గిపోయిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇది కొంత ఊరట కలిగించనుంది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ కూడా పాల్గొన్నారు.

డ్రైవర్లలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కాపులు, మైనార్టీలు సహా పలు వర్గాలకు లబ్ధి చేకూరనుందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా విశాఖ జిల్లాలోని డ్రైవర్లకు ఈ పథకం ప్రయోజనం దక్కనుంది.”

Related posts

నాటు సార తయారీ స్థావరాలపై నర్సీపట్నం పోలీసులు దాడులు

TV4-24X7 News

ఎత్తేస్తారా ? వైసీపీ పెద్దలకు నిద్రలేని రాత్రులు..!

TV4-24X7 News

ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచండి

TV4-24X7 News

Leave a Comment