హైదరాబాద్‌లోని మాదన్నపేటలో జరిగిన బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా హతమార్చింది మరెవరో కాదు, ఆమె సొంత మేనమామ, అత్త అని పోలీసులు దర్యాప్తులో బయటపెట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం—ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో మేనమామ చిన్నారి చేతులు, కాళ్లు కట్టి వాటర్ ట్యాంక్‌లో పడేశాడు.
నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి అమానుషంగా చంపేశారు.
బాలిక తల్లితో ఆస్తి పంపకాల విషయంలో ఇరువురికీ కొంతకాలంగా గొడవలు కొనసాగుతున్నాయి.అదే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలింది.
అమాయక చిన్నారిని ప్రాణాలు తీశిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

