Tv424x7
Andhrapradesh

ఏపీలో భారీగా నకిలీ మద్యం పట్టివేత

అన్నమయ్య జిల్లా మొలకలచెరవులో ఎక్సైజ్ దాడులు — లక్షల లీటర్ల నకిలీ మద్యం స్వాధీనం

మొలకలచెరవు (అన్నమయ్య జిల్లా):అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరవులో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టివేశారు. అర్ధరాత్రి ప్రత్యేక దాడులు నిర్వహించిన అధికారులు లక్షల లీటర్ల నకిలీ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.సమాచారం అందుకున్న ఎక్సైజ్ బృందం ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి, గోదాములు, వర్క్‌షాప్‌లలో దాచిన బారెల్లను సీజ్‌ చేసింది.ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ నకిలీ మద్యం తయారీ, విక్రయం చేస్తున్న కేటుగాళ్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో మద్యం తయారీకి ఉపయోగించే నకిలీ లేబుళ్లు, సీల్స్, ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ కూడా స్వాధీనం చేసినట్లు సమాచారం.స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ఈ నకిలీ మద్యం వ్యాపార వెనుక ఓ అధికార పార్టీ నేత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నేత అరెస్ట్‌కు అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.ఇక ప్రజల్లో మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నకిలీ మద్యం వల్ల నిరపరాధుల ప్రాణాలు పోతున్నా ఇలాంటి వ్యవహారాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts

త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ: మంత్రి రజిని

TV4-24X7 News

పేద‌ల బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ప‌టిష్ట నిఘా..

TV4-24X7 News

వైసీపీకి బిగ్ షాక్

TV4-24X7 News

Leave a Comment