కడప జిల్లా మైదుకూరు మండలానికి చెందిన నేస్తం సేవా సంస్థకు అరుదైన గౌరవం
దక్కింది.జిల్లాలోని వల్లూరు మండలం బీచువారిపల్లె గ్రామంలో జరిగిన వెంకటలక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ రెండవ వార్షికోత్సవ వేడుకల్లో, నేస్తం సేవా సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి, సంస్థ సభ్యుడు కోగటం కొండారెడ్డి గారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నందారపు చెన్నకృష్ణ రెడ్డి, పోతుల ట్రావెల్స్ పోతుల వెంకట్రామిరెడ్డి, గండికోట ప్రమీల గారు పాల్గొని, కొండారెడ్డి గారికి ఉత్తమ సేవా పురస్కారంను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.నేస్తం సేవా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ —“మా సంస్థ తరఫున రక్తదానం, అన్నదానం, సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయగలుగుతున్నాము అంటే, అది మా సభ్యులు, రక్తదాతలు, మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారం వల్లే సాధ్యమైంది. ఈ పురస్కారం అందరికీ అంకితం చేస్తున్నాము” అని తెలిపారు.

