పాక్ ఆక్రమిత కశ్మర్ లో ఇప్పుడు ప్రజా తిరుగుబాటు జరుగుతోంది. ప్రజలంతా పాక్ ప్రభుత్వంపై తిరుగబడుతున్నారు. అన్నీ స్తంభించిపోయాయి. ప్రజల్ని కట్టడి చేయడానికి పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపింది. వారు ఆందోళనలపై కాల్పులు జరిపి కొంత మంది చనిపోవడానికి కారణం అయ్యారు. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పుడు పీవోకేలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద 30కిపైగా డిమాండ్లు పెట్టారు. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం చర్చలకు కమిటీని నియమించిది. ఆ డిమాండ్లను తీర్చేంత శక్తి పాక్ ప్రభుత్వం వద్ద లేదు. ఏదో విధంగా టైంపాస్ చేయాలని.. ఘర్షణలు చెలరేగకుండా.. తిరుగుబాటును ఆపేయాలని అనుకుంటోంది.
అక్కడ జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ స్పందించింది. వాటికి పాకిస్తాన్ ను బాధ్యత వహించేలా చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఇటీవల ఆప్ఘన్ శివార్లలో సొంత దేశ ప్రజలపై సైన్యంతో మిస్సైళ్ల దాడి చేయించింది పాకిస్తాన్. ముప్ఫై మందికిపైగా చనిపోయారు. వారంతా టెర్రరిస్టులని పాక్ చెప్పుకుంది.

