Tv424x7
Telangana

అక్టోబరులో మళ్లీ హైడ్రా కూల్చివేత

హైదరాబాద్

గాజులరామారం డివిజన్‌లోని సర్వే నెంబర్ 307లోని గాలి పోచమ్మ, బాలయ్య బస్తీలలో సుమారు 275 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గత నెలలో కూల్చివేశారు. అధికారులు మళ్లీ అక్టోబరులో పెద్ద స్థాయిలో కూల్చివేతలు జరగబోతున్నాయని హెచ్చరించారు.

సర్వే నెంబర్లు 329, 342లోని కొన్ని బస్తీలు కూడా ప్రభుత్వ భూమిలో వెలసినట్లు గుర్తించబడ్డాయి. ఈ నేపథ్యంలో, స్థలాలు కొని ఇళ్లు నిర్మించిన కొందరు స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.స్థానికులు చెబుతున్నారేమంటే:

“మా డబ్బులు మాకిచ్చి… ప్లాట్లను మీరు తీసుకోండి”. దేవేందర్‌నగర్ ప్రాంతంలో ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే, ఈ నెలలో సుమారు 10 బస్తీలు కూల్చివేయబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related posts

చేపపిల్లల పంపిణీ ఉందా.. లేదా..?సీజన్‌ మొదలైనా నిర్ణయం తీసుకోని సర్కారు

TV4-24X7 News

తెలంగాణ పోలీసులకు కేంద్ర అవార్డులు..!!

TV4-24X7 News

వృద్ధురాలిపై కానిస్టేబుల్ ఫ్యామిలీ దాడి –

TV4-24X7 News

Leave a Comment