ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు శ్రీరాంనగర్‌లో దారుణ ఘటన జరిగింది. కడప జిల్లా ప్రభుత్వ టీచర్ లక్ష్మిని తనే కొడుకు యశ్వంత్ కత్తితో గొంతుకోసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
హత్య అనంతరం యశ్వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం పోలీసులు హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రజలలో తీవ్ర కలకలం వ్యక్తమైంది.

