నారాయణపేట:
నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ శనివారం ఎస్పీ కార్యాలయం (డీపీఓ)లోని విభాగాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తూ, ప్రజా సేవల్లో క్రమశిక్షణ, పారదర్శకత, సమయపాలనను ప్రాధాన్యంగా పాటించాలని సూచించారు.
అందువల్ల, జిల్లా ఆఫీసులన్నింటిలో “5S” విధానాన్ని పూర్తిగా అమలు చేయడం తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.
5S అంటే:1. Sort (విభజన) – అవసరం లేని వస్తువులను వేరు చేయడం
2. Set in order (సంవ్యవస్థ) – ప్రతి వస్తువు సరైన స్థానం లో ఉంచడం
3. Shine (శుభ్రత) – వర్క్‌ప్లేస్ ను శుభ్రంగా ఉంచడం
4. Standardize (స్థిరీకరణ) – పనితీరు ప్రమాణాలు నిర్ధారించడం5. Sustain (నిరంతరం) –
5S ను నిరంతరం పాటించడం
ఫలితం: కార్యాలయాలు సమర్థవంతంగా, పారదర్శకంగా, సమయపాలనతో పనిచేయడం సాధ్యమవుతుంది.

