మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 11 మంది పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో, ఆ ఘటనకు “కోల్డ్ రిఫ్” దగ్గు సిరప్‌కు సంబంధం ఉందనే అనుమానాలపై కేరళ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించిన వివరాల ప్రకారం — రాష్ట్రవ్యాప్తంగా “కోల్డ్ రిఫ్” సిరప్ విక్రయాలు, పంపిణీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో ఉన్న స్టాక్‌ను ఉపసంహరించుకునేలా సూచనలు పంపినట్లు ఆమె తెలిపారు.
ఈ సిరప్‌ను 8 మంది పంపిణీదారుల ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించగా, వారందరికీ సరఫరా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
👉 పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

