Tv424x7
Andhrapradesh

🛕 కడప జిల్లాలో శ్రీ కనుమ పోలేరమ్మ అమ్మవారి రథోత్సవం వైభవంగా 🛕

కడప జిల్లా, అక్టోబర్ 5:జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆదేశానుసారం నిప్పు తెచ్చిన పవిత్ర స్థలం — శ్రీ కనుమ పోలేరమ్మ ఆలయం వద్ద రథోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజులలో ఆలయ ప్రాంగణం చుట్టూ రథోత్సవాన్ని భక్తులు భక్తి పరవశంతో ఊరేగిస్తుంటారు. ఈ ఆదివారం ఉభయ దాతలైన పెద్ద ముడియం వాస్తవ్వులు సాంబవరం జగదీశ్వర్ రెడ్డి గారు, వారి సతీమణి సురేఖ గారు ఆధ్వర్యంలో రథోత్సవం అద్భుతంగా జరిగింది.రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని “శ్రీ కనుమ పోలేరమ్మ తల్లీ తల్లీ” అంటూ నినాదాలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. దాతలు ఈ పవిత్ర సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులను కోరారు.ఈ కార్యక్రమంలో అర్చకులు ప్రసాద్, మిథున్, సిబ్బంది నాగలింగాచారి, శ్రీనివాసులు, చిన్న సుబ్బారాయుడు, భక్తులు తదితరులు పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు.

✨ భక్తిశ్రద్ధలతో సాగిన రథోత్సవం భక్తుల హృదయాలను హత్తుకుంది. ✨

Related posts

గత రెండు నెలల నుంచి ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

TV4-24X7 News

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

TV4-24X7 News

వాగ్దానాలు విస్మరించి రైతులను సీఎం జగన్‌ అవమానించారు: పురందేశ్వరి

TV4-24X7 News

Leave a Comment