Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరులో అక్రమ టపాసుల నిల్వలపై పోలీసుల ఉక్కుపాదం12 టన్నుల అదనపు స్టాక్ స్వాధీనం

కడప /ప్రొద్దుటూరు:రానున్న దీపావళి పండుగ సందర్భంగా అక్రమంగా టపాసులు నిల్వచేసిన వారిపై ప్రొద్దుటూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎస్‌డిపిఓ పి. భావన ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ప్రకాశ్ నగర్, ఆటోనగర్, పొట్టిపాడు రోడ్డులో గల క్రాకర్ గోదాములను పోలీసులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో కొన్ని గోదాముల్లో లైసెన్స్ పరిమితికి మించి సుమారు 12 టన్నుల అదనపు టపాసుల నిల్వ ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్‌డిపిఓ శ్రీమతి పి. భావన మాట్లాడుతూ —“లైసెన్స్ ఉన్నవారు మాత్రమే టపాసుల వ్యాపారం నిర్వహించాలి.గడువు ముగిసిన లైసెన్స్‌లను వెంటనే పునరుద్ధరించాలి.ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇసుక బకెట్లు, నీటి డ్రమ్ములు తప్పనిసరిగా ఉంచాలి.సీసీ కెమెరాలు, ఫైర్ అలారాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు పాటించాలి.18 సంవత్సరాల లోపు పిల్లలను గోదాముల్లో పనికి పెట్టడం నేరం,” అని హెచ్చరించారు.అక్రమ నిల్వలు, లైసెన్స్ ఉల్లంఘనలు గనక కనుగొనబడితే లైసెన్స్ రద్దు, స్టాక్ స్వాధీనం, మరియు న్యాయపరమైన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.సురక్షితమైన, ప్రమాద రహిత దీపావళిని అందరూ జరుపుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Related posts

_వైసీపీ నేతలతో అత్యవసర భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు_

TV4-24X7 News

_ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక_

TV4-24X7 News

చింతామణిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన — కర్ణాటకలో భారీ భద్రతా ఏర్పాట్లు!

TV4-24X7 News

Leave a Comment