Tv424x7
Telangana

BHEL ఉద్యోగులు గ్రూప్-1లో మెరిసిన విజయగాథ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో భీహెచ్ఈఎల్‌ (BHEL) సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు అద్భుత విజయాన్ని సాధించారు. భీహెచ్ఈఎల్‌లో మేనేజర్‌లుగా పనిచేస్తున్న జగదీష్‌ ఆర్టీఓగా, నిషాంత్‌ డీఎస్పీగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నూతన ఆర్టీఓ అధికారి జగదీష్‌ను సన్మానించి అభినందించారు. అదేవిధంగా డీఎస్పీగా ఎంపికైన నిషాంత్‌ను కూడా శాఖ అధికారులు ఘనంగా సత్కరించారు.

ఈ ఇద్దరు ఉద్యోగులు గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించడం భీహెచ్ఈఎల్‌ సంస్థకు గర్వకారణమని సహోద్యోగులు, ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ సేవలో అవకాశం రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని జగదీష్‌, నిషాంత్‌లు ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

హరీశ్ రావు సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా: మంత్రి జూపల్లి

TV4-24X7 News

తల్లి మందలింపుతో నవ వధువు బలవన్మరణం!!

TV4-24X7 News

పార్టీగా ప్రకటించకుండా జాగృతి నియామకాలతో లాభమేంటి?

TV4-24X7 News

Leave a Comment