Tv424x7
Andhrapradesh

బీడీఎల్‌ మిసైళ్ల తయారీ కేంద్రం: 1,600 మందికి ఉపాధి అవకాశాలు!

ప్రకాశం జిల్లా దొనకొండలో రక్షణ రంగంలో భారీ ప్రాజెక్ట్‌ పడ్డాయిగా ఏర్పాటవుతోంది. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) రూ.1,200 కోట్లతో సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌లో ప్రొపెల్లెంట్ మోటార్లు, సమీకృత ఆయుధ వ్యవస్థల తయారీ, టెస్టింగ్‌ సదుపాయాలు ఉంటాయి.

ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలు అయితే, రాష్ట్రం రక్షణ పరికరాల తయారీలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 600 మంది, పరోక్షంగా 1,000 మంది ఉపాధి పొందనున్నారు. 200 ఎకరాల్లో ఆధునిక టౌన్‌షిప్ ఏర్పాటు చేసి 600 కుటుంబాలకు నివాస సదుపాయం కల్పించనుంది.

ప్రాజెక్ట్‌ కోసం మొత్తం 1,400 ఎకరాల భూమి అవసరమని బీడీఎల్‌ వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటికే 317 ఎకరాలను 7.73 లక్షల రూపాయల చొప్పున కేటాయించనుంది. మిగిలిన భూముల సేకరణ కూడా త్వరగా చేయనున్నది.

సెన్సర్లు, కమ్యూనికేషన్ పరికరాలు, క్షిపణులు, తుపాకులు వంటి సమీకృత ఆయుధ వ్యవస్థలతో పాటు వెయ్యి టన్నుల వరకు పేలోడ్‌ మోయగల రాకెట్ మోటార్లు తయారీ జరుగుతుంది. 2026 మార్చి నాటికి అనుమతులు పూర్తిచేసి, 2028 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి, సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.

యూనిట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా ప్రతిపాదించబడ్డాయి: అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌హైవే నుంచి 8 కిలోమీటర్ల రహదారి, రోజుకు 25,000 కిలోవాట్ల విద్యుత్ సరఫరా, రోజుకు 2,000 కిలోలీటర్ల నీటి సదుపాయం.

ఇలాంటి ప్రాజెక్ట్‌లు రాష్ట్రాన్ని రక్షణ పరిశ్రమలో దేశవ్యాప్తంగా ప్రముఖ కేంద్రంగా మార్చనుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కల్యాణి స్ట్రాటజీస్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ రూ.2,400 కోట్లతో అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది, దాంతో ఆంధ్రప్రదేశ్‌ రక్షణ రంగంలో స్థానం మరింత బలపడనుంది.

Related posts

స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు

TV4-24X7 News

రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం

TV4-24X7 News

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

TV4-24X7 News

Leave a Comment