Tv424x7
Andhrapradesh

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు – పోలీసులు చెట్లను తొలగించారు!

కడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మాజీపేట మూలమలుపు వద్ద రహదారిపై ఎక్కువగా పెరగిన చెట్ల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా, ఇటీవల ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు, కడెం పోలీసులు గ్రామస్తుల సహకారంతో రహదారి పక్కన పెరగిన చెట్లను తొలగించారు.

జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడుతూ, “రోడ్డు భద్రత అందరి బాధ్యత. ప్రజల సహకారంతో ఇలాంటి చర్యలు కొనసాగిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. కడెం పోలీసుల చొరవ ప్రశంసనీయం,” అన్నారు.

పోలీసులు ప్రజలను రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలను నివారించేందుకు అందరూ భాగస్వాములవ్వాలని కోరుతున్నారు.

Related posts

నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో

TV4-24X7 News

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

TV4-24X7 News

భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు

TV4-24X7 News

Leave a Comment