Tv424x7
Telangana

గిరయ్యగుట్ట తండాలో సర్పంచ్ అభ్యర్థి సంచలన ఆఫర్..! ఏంటో తెలుసా..?

ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షల విరాళం ఇస్తా..! — పాత్లవత్ నూరియా నాయక్

రంగారెడ్డి జిల్లా ఫరక్‌నగర్ మండలం గిరయ్యగుట్ట తండాలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రామానికి చెందిన రైతు పాత్లవత్ నూరియా నాయక్ తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షలు విరాళం ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 550 మంది ఓటర్లు ఉండగా, రిజర్వేషన్ ఖరారైన వెంటనే నూరియా నాయక్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినవాడిని కాదని, కేవలం గ్రామాభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు.

గిరయ్యగుట్ట, నా గర్లగడ్డ తండాలను అభివృద్ధి చేయడం తన కర్తవ్యమని స్పష్టం చేసిన నూరియా నాయక్ ఆఫర్‌పై గ్రామస్థులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రజలు ఏకగ్రీవానికి ఒప్పుకుంటారా, లేక పోటీ దారులు రంగంలోకి దిగుతారా అన్నది చూడాలి.

Related posts

కవిత సస్పెన్షన్.. హరీష్‌కు మద్దతేనా?

TV4-24X7 News

దివ్యాంగుల రిజర్వేషన్‌పై: ప్రభుత్వం కీలక నిర్ణయం

TV4-24X7 News

పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం. –అడ్డుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

TV4-24X7 News

Leave a Comment